సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే, కథలు తీసుకురండి మీరు ఏం చెప్తే అది చేస్తాం అని చెప్తారు హీరోలు. చెప్పే వాళ్ళు గానీ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ టాలీవుడ్ హీరోలు ఇమేజ్ చట్రంలో ఉంటారు కాబట్టి ఇందులో నుంచి బయటకు రాలేరు. కానీ దీన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. తాజాగా విడుదలైన ఈయన న్యూడ్ పోస్టర్ వైరల్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీన్స్ చేసే ధైర్యం ఏ హీరోకైనా ఉందా. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని మరి ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసే ఆలోచన ఇతర హీరోల ఎవరైనా చేస్తారా. కానీ విజయ్ దేవరకొండ చేసి చూపించారు.
అర్జున్ రెడ్డి రిలీజ్ సమయంలో విజయకి ఇలాంటి ఇమేజ్ లేదు కాబట్టి సినిమా కోసం ఏదైనా చేశారు అనుకోవచ్చు. కానీ విజయ్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ స్టార్ కానీ ఇలాంటి సమయంలో లైగర్ లో న్యూడ్ పోస్ట్ షేర్ చేసి సంచలనం సృష్టించారు. కోసం సర్వం దారపోస్తున్నారు విజయ్ దేవరకొండ
ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ చేశారు. అలాగే బాక్సింగ్ నేర్చుకున్నారూ మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ తీసుకున్నారు.
రెండేళ్లుగా మరే సినిమా జోలికి పోకుండా కేవలం లైగర్ పైనే కూర్చున్నారు. పూరి జగన్నాథ్ కథను విజన్ ను నమ్మి ముందుకు వెళ్తున్నారు విజయ్ మరోవైపు పూరి కూడా విజయ్ ను సరికొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ pk కోసం ఎలాంటి సాహసం చేశాడు. అలాగే అబయ్ సినిమా లో కమల్ నగ్నం గా నటించారు. అలాగే మొన్నటికి మొన్న అల్లరి నరేష్ కూడా నాంది సినిమాలో నగ్నం గా నటించాడు.
లైగర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఎప్పటికీ ప్రమోషన్ లో కూడా జోరు కూడా పెంచేశారు.
సినిమా రిలీజ్ నాటికి దేశం మొత్తం లైగర్ మేనియా నడిచేలా ఉంది..


